కనరావదేల
తస్కరించ దలచినీవు తలపులోన నిలిచి నీవు
సత్కరించ దలచి నిన్ను సాంతము మది నింపినాను
అటులైనా ఇటులైనా ఎటులైనా లోలోపల
దోబూచులనాడనేల తోడుత కనరావదేల
వినువీధిన నడిఝామున వెల్ల
రిక్క వెలుగు కలుగ
నీ వివరము తెలుసుకొనగ
నిండుచందురుని చేరగ
జతనము నే జేయువేళ జాలి తలచి
కానవేల
విరజాజులు వాడనేల వెతల నేను
పడనేల
వడగాడుపు సుడిన నిలిచి వెడలలేక పడిగాపులు
గాయుచున్న దూదిపింజె కైవడి మది డోలికలు
దారిలేని గమనమాయె దరి గానని గమ్యమాయె
నిలకడయే లేకపోయె నీవు కానరావాయె కోయిలమ్మ గళ మధురిమ
కొంచెమైన వ చెరుకు
రామ మోహన్ రావు
Super sir
ReplyDelete