పరమేశ్వరాంకిత పద్య ధార-1
శ్రీ కరులు సుముఖ షణ్ముఖ గౌరి శ్రీధరుడు
శ్రీ దేవి హృదయ వన శ్రీనివాసుండు
శ్రీరస్తు సర్వశుభ శ్రీ ర్విజయమస్తు
అనుచు దీవించగా ఆనంద వార్ధి
పున్నమి చంద్రుని పూర్ణ బింబమును
చూసి ఎగసెడు చూడ్కి చుక్కలంటగను
ఉల్లాసమెగసినా ఉల్లమ్ము దాటి
పోవనుంకించగా పోరిమి తోడ
తల నేల తాకించి తామసము వీడి
దండాలు పెట్టి నను దరిజేర్చమంటి
వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశ తత్వాత్మకం
తస్మాదుత్తమ తత్వ మక్షరమిదం ధ్యేయం సదా యోగిభిః
ఓంకారాది సమస్త మంత్ర జనకం సూక్ష్మాది సూక్షంపరం
శాంతం పంచమ మీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజో మయం
ఓం ఈశానః సర్వ విద్యానం
ఈశ్వరః సర్వ భూతానం
బ్రహ్మధిపతి బ్రాహ్మణోధిపతిః బ్రహ్మ
శివోమే అస్తు సదా శోవోం
మంచికి ఊపిరూదుచును మాన్యత దానికి తోడుజేయుచున్
లక్ష్మీదేవి తన సమస్యను ఏవిధముగా పరిష్కరించుకొన్నదో చూడండి
ఒక ఊహ
గెస్టు వచ్చినంత గెట్టిన్ను ప్లీజంచు
అతిథి సేవలెల్ల అగ్నికాహుతియాయె
పాత చింతకాయ పచ్చడి రుచులను
చచ్చి బతికి చేయు సంపాదనములెల్ల
రేయియునుపగలు బనాసు రెడ్డి బడయ
పొగరు కూడిన నవ్వును వగరు నవ్వు
సరస్వతీ ప్రార్థన ( రచయిత, డా. చింతలపాటి మురళీకృష్ణ గారు)
ఏ దేవి నెలుగెత్తి యెవరు ప్రార్ధించినన్
నింతకింతగ పల్కరించు తల్లి -
నీరీతి నీ వాఙ్మయీ చిత్ర సంపదన్
మురిపించువారి నెన్నుదుట నిలచి
నీ వర్ణనారూప భావాంబరోద్భూత
చిచ్చక్తి లోక సంక్షేమ మరసి
దివ్యమౌ మహనీయ తేజ సంపుటి నింపి
తెలుగుభాషను వోలె తీర్చిదిద్ది
చెరుకు రససిద్ధి గల్పించి చివరి వరకు
రామమోహను రూపానురక్తి కలుగ
జనులనందర గాచెడి శక్తి వనుచు
వేడుకొందు సరస్వతీ!వివిధ గతుల!
రాముడు మోహనుండు రఘురాముని చేత మహేక్షు దండమే /
కామశరాస్త్ర సన్నిభముగా నలరారుచు పల్కుపల్కునన్/
హేమ రసార్ద్రభూషితమునై విలసిల్లుచు తెల్గువారికిన్/
కామితమిచ్చుచున్ చెరకు కండరసంబు ననుగ్రహించెడిన్ !! (05/12/17)
(పై రెండు పద్యముల రచయిత, డా. చింతలపాటి మురళీకృష్ణ గారు)
విళంబి నూతన సంవత్సరము 11/1/18
వాణీ స్థుతి (స్వీయ రచన)
ఏ దేవి సకల కవీంద్ర జిహ్వా
పుండ
రీక నివాస మంగీకరించు
ఏ దేవి జడ పైన ఎనలేని రత్నమై
ఒదుగు చంద్రుండెంతొ ఉజ్వలముగ
ఏ దేవి గళసీమ నింపునింపెడు
హీర
నీహార హారాల నిండుకాంతి
ఏ దేవి ఎకిరింత ఎన్న
రాయంచయై
స్వేతపద్మాసన సేవ కొదుగు
హస్తముల కీర పుస్తక అక్షమాల
వీణ కల్గిన ఏ దేవి విధికి
సుదతి
అట్టి తల్లిని తిరముగా
నాత్మ దలచి
వేడుకొందుము శుభముల
వెల్లువలకు
మకరంద పానప్రమత్త పుష్పంధయ
కమనీయ మృదుల గానములు వినుచు
ఘనదామ్ర కిసలయ ఖాదన తత్పర
వన హృద్య కోకిల ధ్వనులు వినుచు
పరిపక్వ సహకార ఫలరస పరివృత్త
సలలిత కీర భాషణలు వినుచు
నృత్త విశేష మానిత తాల వృంతాభ
బర్హిబర్హణ విరావములు వినుచు
చూత జంబీర దాడిమీ శోభలలర
మదిని బంధింప విరజాజి మల్లె విరులు
తటములో మీల గతులెంతొ తనియజేయ
అవ్యయానందమున వచ్చె నావిళంబి
సమస్య : శవ పూజల్ సుఖదాయకంబులు కదా! సంవత్సరాదిన్ సఖా!
భవభోగమ్ముల నివ్వగో రుచుసదా భక్తిన్ ప్రపూజింతుమే
మవధా నమ్మున నిల్పుచున్ మదిగ దిన్నా సాం తమున్ ప్రీతితోన్
ఎవనిన్ పూజలు సేతుమో ఫలితమున్ ఇమ్మంచు నేడట్టి కే
శవ పూజల్ సుఖదాయకంబులు కదా! సంవత్సరాదిన్ సఖా!
న్యస్తాక్షరి
అంశము: సీతారామ కళ్యాణము
ఛందస్సు - ఆటవెలది నాలుగు పాదాల చివరి అక్షరములు వరుసగా 'భ - ద్ర - గి - రి ఉండవలెను
నా పూరణ
చూపు నేలదాక సుందరమౌ శుభ
మూర్తమందు సీత మోద సాంద్ర
వేదఘోష నడుమ వేసెను తా సాగి
రాగభరిత మాల రాము జేరి
మంచికి ఊపిరూదుచును మాన్యత దానికి తోడుజేయుచున్
మించిన ఆర్ద్రతన్ మితము మీరు సహాయము చేయు బుద్ధియున్
ఉంచుచు నీలకంఠుడను ఉన్నత వ్యక్తిని బంపి నాదరిన్
సంచిత పాప కార్య ఫలసాయము బాపితివయ్య శంకరా!
చేసిన పాపమేమొ మరి చెప్పెడు వారొకరైన లేరు నే
చేసెదనంచు సాయపడి చిక్కును దీర్చుచు దానియంతమున్
చూసేడు వారు లేరు బహు చోద్యము నా కథ, నింకనైన నా
కోసము, బన్నముల్ గడుప కూరిమి నొక్కని బంపు శంకరా!
అడ్డము లేరటంచు తమకబ్బిన వంచన, మంచియన్న ఓ
గుడ్డను పింజేపోసి మరి కూరిమి తోడుత కట్టి నాల్క పై
దొడ్డగు జుంటితేనియను తుమ్మెద పట్టుల తెచ్చి రాచి తా
చెడ్డకు పూత పూయుచును చిమ్మె విసంబును ఎంచిచూడగన్
బొడ్డును కోతుమంచు చిరు పొట్టను కోసెడు మంత్రసానులీ
గడ్డన మారువేసముల కత్తుల పూవుల గుత్తులంచు బల్
సొడ్డుల తోడుతన్ మిగుల సూక్ష్మ విధమ్మున దారి మార్చి కా
లొడ్డుచు క్రింద త్రోయు కడు లుచ్ఛులు తుచ్ఛులు కాన వచ్చెడున్
సత్వము వారసత్వమయి సామరస్త్వము దానియంగమై
తత్వములో రసత్వమును సత్వర రీతిన పొందగోరి భి
న్నత్వము నమ్మబోక నిను నమ్ముచు నాయెద నిల్పి నేను ఏ
కత్వము చాటుచున్ త్యజిత కాముడ నై మదిగొల్తు శంకరా!
శ్రీ శంకర తోటకాష్టకము
పరమేశ్వర పాదసేవానురక్తి
కలిగినటువంటి పరమ భాగవతులకు నేను అందించే చిరుకానుక ఈ పరమేశ్వర తోటకాష్టక
స్తోత్రము.
తోటకము అన్నది ఛందస్సులో ఒక
పద్య విశేషము . ఈ తోటకములో రచింపబడినది వెంకటేశ్వరా సుప్రభాతమునందలి 'కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీల తనో' అన్న పద్యముతో మొదలయి 'అజ్ఞానినా మయా దోషా' తో ముగిసే స్తోత్రము.
ఇందులో 'సులభం సుఖదం...' వరకు రచన తోటక
వ్రుత్తములోనే సాగుతుంది.ఈ వెంకటేశ్వరా స్తోత్రమును ప్రతివాద భయంకర అణ్ణన్ అన్న
పరమ భక్తుడు మనవళ మహాముని శిష్యుడు రచించుటకు ఎన్నో శతాబ్దములకు పూర్వమే జగద్గురు
ఆదిశంకరులవారిని నుతిస్తూ వారి నలుగురు ప్రథమ శిష్యులలో ఒకరి, ఆనందగిరి అన్న పూర్వ నామము
కలిగి, శంకరులచేత ప్రతిష్ఠింపబడిన
ఉత్తరామ్నాయ పీఠమునku మొదటి పీఠాధిపతియైన
తోటకాచార్యులవారు.ఆయన శంకరులవారి శిష్యులయిన కొత్తలలో మండమతిగా వుండేవారట.అందుచే
అందరూ ఆయనను 'గిరి' అని 'అచల' అని పిలిచేవారట. అంటే వారి
దృష్టిలో ఆయన అంత మొద్దు.
ఒకనాడు శంకరులవారు
ఆనందగిరియోక్క అచంచల భక్తిని మిగత శిష్యులకు చూపనెంచి, ఆవల ఒడ్డుననున్న తన ఆరవేసిన
బట్టలను తెమ్మన్నాడు. శిష్యులు ఆలస్యమును సహించలేక పాఠము చెప్పమని శంకరులవారిని
తొందర చేసినారు. శంకరులవారు తమ తపః శక్తితో ఆనందగిరిని సకల వేదశాస్త్ర పండితుని
గావించినాడు.
బట్టలు తెచ్చి నిలిచిన
ఆనందగిరి పారవశ్యముతో తదేకముగా గురువును చూస్తూ, కష్టమగు తోటక వృత్తములో, గురుస్తోత్రమును ఎనిమిది
శ్లోకములలో చేసినాడు. అదే తోటకాష్టకముగా ప్రసిద్ధినందినది. ఆయన అప్పటినుండి
తోటకాచార్యులుగా పిలువబడినారు.
అటువంటి తోటకములో నావంటి
చదువురానివాడు శివుని స్తుతిస్తూ ఒక
అష్టకమును సంస్కృతములో వ్రాయబూనుట సాహసమే!
అయినా నా ఈ
ప్రయత్నమునకు పరమేశ్వరానుగ్రహము లభించుట చేతనే నేను దీనిని
సంస్కృతములో
వ్రాయగలిగినానని త్రికరణ శుద్ధిగా నమ్ముచున్నాను. నా ఈ
చిరుప్రయత్నమును మనసారా
అభినందిన్చుతారన్న నమ్మకముతో ఈ
పరమేశ్వర స్తోత్రముతో మీ ముందుకు వస్తూవున్నాను.
భూతాధిప కాల విభూష ధరా
శరణాగత రక్షక సాదు ప్రభో
మమ పాపవిదారక మాన్యవరా
పరమేశ దయాకర పాహి ప్రభో ll 1 ll
కరుణా వరుణాలయ కామ హరా
భవతారణ కారణ భవ్య పరా
అహిధారణ మారణ అక్షధరా
పరిపాలయ మాం శివ భాగ్యకరా ll 2 ll
శివ శంభు మహేశ్వర శైల స్థితా
భవ భూతి ప్రదాయక భద్ర హితా
ఇహ సాగర వారధి ఈప్సితదా
సుకపోల సుధామతి శూన్యరతా ll 3 ll
గళహాల రసంధర గౌరివరా
శిశుచంద్ర విలాసిత శీర్షధరా
అకళంక అనీశ మహా2హిధరా
శరణాగత వత్సల సారతరా ll 4 ll
సుముఖం సుహృదం శుభ సౌఖ్య యుతం
హర శంకర శూలి మహా మహితం
కరిదానవ భంజక కాలసతం
విధి విష్ణు సదార్చిత విశ్వనుతం ll 5 ll
శితికంఠ మయస్కర శీత శిరా
భవబంధ విమోచన భాగ్యకరా
కవిగాయక వందిత కావ్య వరా
వరదాభయ, వారణ వస్త్ర ధరా ll 6 ll
పరమేశ పరాత్పర భక్తసుధా
జగదీశ జగద్దిత చారు కథా
పరదేవత, పాలిత భక్త ప్రథా
రమణీ ప్రతి, భంజక రాగ వ్యథా ll 7 ll
పరమాత్మ పతంజలి పాణి నుతం
ప్రమథాధిప, పావన వాణి సతం
సురగంగ జటావళి ఝూట స్థితం
పరమేశ సదాకురు భక్త హితం ll 8 ll
శివ తోటకమిదం ప్రోక్తం అష్టకస్తోత్ర రూపిణం
ఏ పఠంతి సదా భక్తాః తేషాం శంభుః ప్రసీదతి ll
రామమోహన కృతం స్తోత్రం సాయం ప్రాతర్ పఠేన్నరః
సర్వార్థ సిద్ధిమాప్నోతి సర్వ దుఃఖోపశాన్తయే ll
విష్ణు నుతి
మామ మామ మీకు మాసంపదలనిచ్చి
మసలజేయు మంచి సంతునిచ్చి
మామతీశు నతము మనసార నుతియించి
మంచి పొందగలరు మరల మరల
విష్ణు పత్ని లక్ష్మీదేవికి తండ్రి యగుటచే సముద్రుడు విష్ణువునకు
మామ. అదేవిధముగా తన పాదముల చెంత పుట్టిన గంగ సముద్రుని చేరుటచే విష్ణువు
సముద్రునికి మామ, కావున ఆ మామ మామ మీకు మహా సంపదలనిచ్చి , మంచి
సంతానమునిచ్చి కాపాడుగాక! మా అనగా
లక్ష్మీ దేవికి ఈశుడగు విష్ణువును సతతమూ తలచి సకలసంపదలను సతతమూ పొందుదురుగాక!
లక్ష్మీదేవి తన సమస్యను ఏవిధముగా పరిష్కరించుకొన్నదో చూడండి
కమల దళాయతాక్షి తమకమ్మున కాంతుని గూడ నెంచి యా
యమల తటిల్లతాంగి హరి యక్కున జేరుచు యోరకంటితో
తమ దెస గాంచు యా నలువతత్తర బాపగ నెంచి పూరుషో
త్తము కుడి కన్ను మూయ తమి తగ్గెను తామర గుంక నాభిలోన్
మత్స్య కేతనుడా ముగుద మదిన జేరి
చూపు తూపుగ, వింటిగ సుదతి భృకుటి
చేసి విడిచెను నామది చెదిరి పోవ
ఆపుకోలేను ఈవిరహ మహరహమ్ము
నేటి దుస్థితి
అతిధి ఇల్లు త్రొక్కి అరుదెంచినంతనే
కూరుచుండ జేసి కుశలమడిగి
దాహమిచ్చి యతని తనియింపగా జేసి
గౌరవించినారు గాంచ నాడు
గెస్టు వచ్చినంత గెట్టిన్ను ప్లీజంచు
గ్లాట్టుమీట్ యు చెప్పి కదలనీక
కాఫి చేతికిచ్చి గాసిప్పు మాట్లాడి
పంపుతారు నేడు ‘బాయి’ జెప్పి
అతిథి సేవలెల్ల అగ్నికాహుతియాయె
కాలమాయే మంచి కాలమంత
సాంప్రదాయమెల్ల చట్టుబండైపోవ
ఏమి మిగిలె మనకు ఎంచిజూడ
పాత చింతకాయ పచ్చడి రుచులను
ఎట్లు తెలియగలరు ఇంట లేక
రోజు మారెనేని రోత వాసనలొచ్చు
తిండ్లు తిన్న కలుగు తిప్పలెన్నొ
చచ్చి బతికి చేయు సంపాదనములెల్ల
హాస్పిటళ్ళ జేసి యంకితమ్ము
సైడెఫెక్ట్లుతోడ చచ్చిపోవుట తప్ప
ఏమి పొందగలము ఈ ధరిత్రి
నాగ సుబ్బా రెడ్డి నవనీత
హృదయుండు
నయము కలిగినట్టి నడత యుండు
మానవత్వముపైన మాన్యత
బహుమెండు
మనసు గాంచ తనది మల్లెచెండు
కష్టాల కండెల కరకు
కంకులగుండు
దొరిలించి ఫలితాల దోచుచుండు
సంసార రథ పార్థ సారధి యాతండు
సంస్కారమున సవ్యసాచి యతడు
రమ్య గుణమణి గృహిణిని రాణి
జేసి
ఏల సంసార సామ్రాజ్యమెల్ల వేళ
ఆర్తి తోడుత నడిగెద
నంబ కరుణ
వివిధ విధముల నవ్వులు
పూర్ణ చంద్రుని నవ్వు
పులకరింపుల నవ్వు
పూలు విరియు నవ్వు పుచ్చు నవ్వు
వీరోచితపు నవ్వు
విశ్వజేతలనవ్వు
వెగటు పుట్టు నవ్వు
వెకిలి నవ్వు
తేలుకుట్టిన నవ్వు తేనే
బూసిన నవ్వు
తేలికయిన నవ్వు
తిక్కనవ్వు
మేలుబంతుల నవ్వు
మేధావికగు నవ్వు
ముద్దులొలుకు నవ్వు మొలక నవ్వు
పొగరు కూడిన నవ్వును వగరు నవ్వు
రక్కసుల నవ్వు వెలుపల
రాని నవ్వు
చెప్పలేనన్ని నవ్వులు
జెలగ భువిని
చెప్పలేకుంటి నెన్నని
చేతగాక
ఒక సినీతార వీరాభిమాని
కచ్చటికమ్ము తోడనొక కమ్మని పోజున గోడనున్న నీ
పచ్చని మేను జూచునను పజ్జన వచ్చెడుబస్సు గ్రుద్దగా
అచ్చెరువంద నా రుధిర మంటుచు నీ పదదోయి వెంటనే
విచ్చె వియచ్చరల్
బొగడ వేడుక కెంపుల తమ్మి పూవులై
పోల్రెడ్డి
వెన్న కన్నను మిన్నయౌ మనసు వుండి
బాధ జలధుల గుండెలో బడసి యుండి
మానవత్వము నెప్పుడూ మరువకండి
మసలు బసిరెడ్డి పోల్రెడ్డి మాన్యతముడు
నీల ఘనుడతండు నీటైన వపుషుడు
నొక్కు జుట్టు వాడు నడుగు రేడు
నాణ్యమైనయట్టినాగరీకుడతండు
నెమ్మి చెరువు నాకు నెయ్యుడతడు
రామకృష్ణా రెడ్డి
మనిషి మౌని గాని మనసేమో మాటాడు
వెతల గతుల జూచి వెరవడతడు
బాధ హృదయ గదిన బంధించి
యుంచును
రామ కృష్ణ రెడ్డి రజత నగము
నాగేశ్వరమ్మ నిజముగ
మాగిన రసభరితమైన మామిడి పండున్
సాగెడు తుంగా తీర్థము
రాగములో కోకిలమ్మ రాగము బోలున్
అభినందన
కచము జంఘమంట
కదులుచు శ్రీదేవి
విరులు కురులు జేర్చి వేడ్క మీర
మరులు గొల్పు రీతి మందస్మితము తోడ
సిరులు తెచ్చు మీకు శీఘ్ర గతిని
అభినందన
కురులు జంఘమంటి కుులుకగ, శ్రీదేవి
విరులు జేర్చి జడకు వేడ్క మీర
మరులు గొల్పు రీతి మందస్మితము తోడ
సిరులు తెచ్చు మీకు శీఘ్ర గతిని
దేశ పటము
రాజకీయములందు రాటుదేలిరి గాని
శూరత క్రియలందు చూపుటేది
కవితలల్లుటయందు కాళిదాసులె గాని
ఉపమానములు వ్రాయ నూహ ఏది
వాగ్దాన కర్ణులై వరలు వారలె గాని
మాటలు నిలబెట్టు మాన్యతేది
శ్రీ రంగ నీతులు జెప్పువారలె గాని
చేతలో జూపించు చేవ ఏది
కుటిల బుద్ధులు మంచిని కుంచె తోడ
చేసి పటమును గోడకు జేర్చినారు
చూపుటకు దప్ప నది చేత చూరగొనదు
వీరలే నేడు మనపాలి వీరులైరి
జయహో భారత మాతా
స్వాతంత్ర్య దినము దగ్గర పడింది. వీలు చేసుకొని తల్లి భారతిని తలచుకొందామా!
వీర నారులు మరి విదుషీ
లలామల
మహిళామణులయొక్క మాన్య మాత
దేవ పుత్రులగాక
దేవదూతలగాక
దేవునే కంటివి తెల్ప గీత
వేలవత్సరముల వెనుక
వెలసినయట్టి
పరమ పావన కీర్తి
భరిత నేత
వేద చోదితమైన విజ్ఞాన
ఖనివౌత
నిష్ఠ
తోజేతును నీకు జోత
విశ్వవిజ్ఞాన దాతయౌ
విమల చరిత
చారు కరుణానురాగాల శాంత
సరిత
దివ్య ఋషిముని శాస్త్రజ్ఞ
ధీర భరిత
లేదు కొలమానమిల కొలువ
నీదు గరిత
No comments:
Post a Comment