ఇది దేవులపల్లి కృతి రాగం: మార్గహిందోళం తాళం : రూపకం (దాద్రా)
శివ శివ శివ అనరాదా
శివ శివ శివ అనరాదా
శివ నామము చేదా
శివపాదము మీద - నీ
శిరసునుంచరాదా
భవసాగర మీద - దు
ర్భర వేదన ఏదా ॥
కరుణాళుడు కాదా ప్రభు
కరుణాళుడు కాదా ప్రభు
చరణ ధూళి పడరాదా
హరహరహర అంటే మన
కరువు తీరి పోదా ॥
కరి పురుగు పాము బోయ
కరి పురుగు పాము బోయ
మొరలిడగా వినలేదా
కైలాసం దిగి వచ్చి
కైవల్యం ఇడలేదా
మదనాంతకు మీద - నీ
మనసెప్పుడు పోదా
మమకారపు తేరా స్వామిని
మనసారా కననీదా ॥
ఇది నేను వ్రాసినది:
శివ శివ యనరాదా శివనామము చేదా
భవ భవ భవ శుభదా యన బాధ నిలువ గలదా
శ్వపాదము మీద నీ శిరసు నుంచరాదా
కనికరించు వరదా యన కరుణ మనల కాచు గదా ||శివ శివ||
గగన తలము నుండి దుముకు గంగ నెత్తికెత్తె కదా
శ్రీకరులను గావ తాను శ్రీకంఠుండాయె సదా
మనసారా హర యంటే మనకు కరువు తీరదా
తామసింపబోక శివుని తలచ తీరి పోవు దువిధ ||శివ శివ||
పంచ బక్ష్య పాయసాలు పనిలేదని తెలియదా
భూరి సంపదలు పొందగ బూధి పూజ సులువు కదా
బిర బిర తా కరుణించగ బిల్వ దళము చాలదా
గంగధారి పాపాలను గంగపాలు చేయుకదా ||శివ శివ||
మనసారా కననీదా ॥
ఇది నేను వ్రాసినది:
శివ శివ యనరాదా శివనామము చేదా
భవ భవ భవ శుభదా యన బాధ నిలువ గలదా
శ్వపాదము మీద నీ శిరసు నుంచరాదా
కనికరించు వరదా యన కరుణ మనల కాచు గదా ||శివ శివ||
గగన తలము నుండి దుముకు గంగ నెత్తికెత్తె కదా
శ్రీకరులను గావ తాను శ్రీకంఠుండాయె సదా
మనసారా హర యంటే మనకు కరువు తీరదా
తామసింపబోక శివుని తలచ తీరి పోవు దువిధ ||శివ శివ||
పంచ బక్ష్య పాయసాలు పనిలేదని తెలియదా
భూరి సంపదలు పొందగ బూధి పూజ సులువు కదా
బిర బిర తా కరుణించగ బిల్వ దళము చాలదా
గంగధారి పాపాలను గంగపాలు చేయుకదా ||శివ శివ||
No comments:
Post a Comment