Wednesday, 8 December 2021

ధర్మము

ధర్మము
https://cherukuramamohanrao.blogspot.com/2016/03/blog-post.html
ధర్మము అన్నది మన మతములో మన సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనది. దీనిని ఇంకే భాషలోనికీ  అనువదించుట సాధ్యము కాదు.

నిజానికి ధర్మము అన్న పదము ఒకటే అయినా దాని ప్రకృతి ఆపాదించిన వస్తువును బట్టి మారుతూ ఉంటుంది.

వేదము సనాతన ధర్మమును గూర్చి, వర్ణాశ్రమధర్మముములగూర్చి, రాజ ధర్మమును గూర్చి, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, ఈ విధముగా అనేకమయిన ధర్మములను గూర్చి మనకు తెలుపుతుంది. వీటన్నింటినీ కలిపి పురుషార్థములలో ధర్మము అన్న ఒక అంచులు తెలియని గొడుగు క్రింద ఉంచింది. నిజానికి, ధర్మ శాస్త్రమన్నది, ఇలా, అనేక సందర్భాలలో అనేక అర్థాలు సంతరించుకుంటుంది. శ్రీరామ శ్రీ కృష్ణులు ఆయా యుగ ధర్మమునకు  ఉదాహరణలు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’, శ్రీరాముడు సామాన్య జనులకు మూర్తీభవించిన ధర్మమే కాకుండా ఆచరణ, అనుసరణ యోగ్యము. ఆయన వాలిని చంపినా, తాటకను చంపినా, రావణుని చంపినా, శంబూకుని చంపినా, నిండు చూలాలైన సీతను అరణ్యవాసానికి పంపినా, సీతను అగ్నిప్రవేశము చేయమనినా,  అంతా ధర్మబద్ధమే! అది తెలుసుకొనే చేతగానితనముచే, ఆయన చేసిఅవి ధర్మబద్ధములు కాదు అంటే దాని మనకు ధర్మమంటే  ఏమిటో అవగాహనకు రాలేదనే!

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||

 

ఎప్పుడు ధర్మ గ్లాని సంభవిస్తుందో అప్పుడు యుగయుగమున  అవతరిస్తానని కృష్ణపరమాత్మ చెబుతున్నాడు. మానవాకృతి రూపముననే కాక జలచర, ఉభయచర, భూచర, మానవ-మృగ రూపములను దాల్చి, పూర్ణావతారములగు  రామునిగా, కృష్ణునిగా ఇంకా అనేకానేక రూపములను దాల్చి ధర్మ సంస్థాపన చేసినవాడు పరమాత్మ. 
ధర్మ మంటే ఏమిటి? धरति लोकान् ध्रियते पुण्यात्मभिरिति वा లోకములో అన్నిటిచేత ధరింపబడేది ధర్మము. పుణ్యం, శ్రేయస్సు, సుకృతఉ - ధర్మానికి పర్యాయ పదాలని అమర కోశం చెబుతుంది. ఆచారము, స్వభావము, క్రతువు ధర్మమని ధర్మ శాస్త్రం చెబుతుంది. అహింస పరమ ధర్మమని ఉపనిషద్ వాక్యము. దీనినే జైన , బౌద్ధాలుకూడా స్వీకరించినాయి. దానము, ధర్మము చేయదగిన కర్మలని యోగ సారం చెబుతుంది.

प्राणायामस्तथा ध्यानं प्रत्याहारोऽथ धारणा

स्मरणञ्चैव योगेऽस्मिन् पञ्च धर्म्माः प्रकीर्त्तिताः ll

ధర్మ దేవత అన్నది యమునికి మరోపేరు. ధర్మ పత్ని ధర్మా చరణలో సహధర్మ చారిణి. ధర్మాధికారి అంటే న్యాయ మూర్తి. ధర్మాసనం - Seat of Justice, Bench 
1. Dharma varies from context to context from person to person, Yuga to Yuga. Dharma is not like a steel rod which is not flexible. Dharma is highly flexible. For example to kill somebody in some context may be Dharma. In the same way in another context to save somebody may be Dharma. Both are Dharma. ధర్మం సందర్భానుసారము మారుతుంది. (not a rigid rule) యుగాన్ని బట్టి, దేశాన్ని బట్టి మారుతుంది. ఒక సమయంలో చంపడం ధర్మం. ఒక సందర్భంలో రక్షించడం ధర్మము. 
2. Dharma is appropriateness in thought, action, attitude and judgment to a thing or a happening or a desire or an incident in life. ధర్మమంటే సందర్భోచితమైన ఆలోచన, క్రియ, దృక్పథం, నిర్ణయం, అది అప్పటి పరిస్థితి, సమయం, లక్ష్యం, మొదలైన వానిపై ఆధార పడుతుంది 
3. Unless Dharma is protected all around, we will not get the ideal atmosphere to live in. Unless we abide by Dharma, we cannot contribute to it. So, for the sake of the society or the country, we should live in Dharma and only when it is protected all around, it is possible. Unless Dharma is protected all around, we will not get the ideal atmosphere to live in. Unless we abide by Dharma, we cannot contribute to it. So, for the sake of the society or the country, we should live in Dharma and only when it is protected all around, it is possible. ధర్మ సంరక్షణ జరిగితేగాని మనం నివసించే వాతావరణము పరిశుభ్రముగా ఉండదు. మనము వ్యక్తిగతముగా ధర్మ మార్గంలో ఉంటే తప్ప మనము ధర్మ సంరక్షణకు తోడుపడలేము. సమాజ హితం, దేశహితంకోసము ప్రతివ్యక్తి ధర్మ మార్గంలో నడవాలి. 
4. Adharma must be totally avoided. Dharma is a positive direction. You may or may not be able to follow that path. Not indulging in Adharma is the primary responsibility for one and all. If Adharma is practiced it does not kill you alone. It is the poison in the air, water and kills anyone. 
అధర్మమును పూర్తిగా పరిహరించాలి. ధర్మాచరణ అనేది ఒక మార్గం, నడవ వలసిన ఒక దిశ. అధర్మ వర్తన ఆ వ్యక్తినే కాక చుట్టూ ఉన్న వాతావరణాన్ని, సమాజాన్ని కూడాదహిస్తుంది. 

అసలు మహాభారతము నందలి విదురనీతి లోని ఈ పద్యము సర్వకాల సర్వావస్థల యందును శిరౌధార్యము.
తిక్కన మహాభారతంలో ఉటంకించిన నీతి, ఆంధ్రపత్రిక దినపత్రికలో ప్రతిరోజూ కనిపించిన పద్యమిది.

ఒరులేయవి యొనరించిన

నరవర! యప్రియము తన మనంబునకగు తా

నొరలకవి సేయకునికియె

పరాయణము పరమధర్మపథముల కెల్లన్.
The English quotes are from talks of Sadguru K. Sivananda Murty garu

Tuesday, 7 December 2021

ధర్మరాజు స్వర్గారోహణము

 

ధర్మరాజు స్వర్గారోహణము

https://cherukuramamohanrao.blogspot.com/2021/12/blog-post.html

మనకు భారతములో స్వర్గారోహణ పర్వము కలదు. కానీ అందలి వర్ణనలు మనకు అంతు బట్టవు. నాటి మహనీయులు ఎవరయినా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు వ్రాయరు. వారు వ్రాసే ప్రతి మాటా అక్షరసత్యమే! అంతటి బలమైన నమ్మకముతో ఈ వ్యాసమును చదవండి. పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. భూమి నుండి స్వర్గానికి చేరుకోగలిగిన ఏకైక మార్గము ఇదే.

బద్రీనాథ్ క్షేత్రము మనకు తెలిసినదే!  నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం.

భారతదేశముయోక్క చివరి గ్రామము కూడా ఇదే! ఇచ్చటి నుండియే టిబెట్ ప్రారంభమవుతుంది.

ఈ గ్రామము యొక్క  చివరన సరస్వతి నది మనకు ప్రవహిన్చుతూ కనిపిస్తుంది అంటారు. ఇక్కడి నుండి ఆనది కొంత దూరం ప్రవహించైనా పిదప అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది.

ఈ సరస్వతి నది పక్కన  భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి.

ఈ వంతెన దాతిన తరువాత స్వర్గారోహణ మార్గం ప్రారంభమవుతుంది.

ఇచట నుండి చట్మోలి 8కి.మీ. దూరము.  మార్గ మధ్యమద్యములో భృగుమహర్షి ఆశ్రమము కన్పిస్తుంది. ఆతరవాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కుడా చెప్తారు. ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతం గా తీసుకున్నట్లు చెప్తారు.

ఇక్కడినుండి 5కి.మీ. ప్రయాణం చేసిన తరువాత వసుధార జలపాతము వస్తుంది.

ఇక్కడే అష్ట వసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి పడుతుంది.

ఇక్కడ గాలులు బలంగా వీస్తూ ఉండుట చేత ధార చాల పలుచగా నీటి తుంపర లవలె పడుతుంది. పాపులపై ఈ జలధార పడదు అని స్థానికులు అంటారు.

తర్వాత చట్మోలి ( 12000 అ ఎత్తులో ) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి చేరుకుంటాం. పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.

ఇక్కడే సతోపంత్ మరియు భగీరధ్ కర్క్ అనే రెండు నదులు   ( హిమనీనదములు ) కలిసి #అలకనంద గా ఏర్పడతాయి. అక్కడి నుండి ముందుకు వెళితే ధనో హిమనీనదం కు చేరుకుంటారు. 

చట్మోలి నుండి లక్ష్మి వన్ 1కి.మీ. దూరము. (ఇది 12600 అడుగుల ఎత్తు లో ఉన్నది). తర్వాత లక్ష్మీవన్ ప్రాంతం కు చేరుకుంటారు. ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఏంతో ఆహ్లాదం గా ఉంటుంది. 

ఇక్కడే లక్ష్మి నారాయణులు కొంతకాలము తపస్సు చేసినట్లు తెలిసినవారు అంటూ ఉంటారు. ఇక్కడే ద్రౌపది తనువు చాలించిందట.  ఇక్కడి నుండి 2కి.మీ. పయనించితే  బంధుర్ అనే ప్రాంతమును చేరుకుంటాము. ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి అర్జునుడు బాణ ప్రయోగం చేసినట్లు చెబుతారు. బంధుర్ నుండి సహస్రధార 4km ( 14000 అడుగుల ఎత్తులో ఉన్నది).

సహస్ర ధార నుండి  చక్ర తీర్ధము 5కి.మీ. (15000 అడుగుల ఎత్తులో ఉన్నది). చక్రతీర్థము విష్ణుమూర్తి తన సుదర్శన చక్రమును  కింద పెట్టుట వలన ఏర్పడిన సరస్సు గా తెలిసినవారు చెబుతారు. ఇక్కడే అర్జునుడు తనువు చాలించినాడని తెలియవస్తూ ఉన్నది.

చక్రతీర్ధము నుండి సతోపంత్ 5కి.మీ. ఈ సతోపంత్ అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు. ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే  సరస్సు.

ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపం లో వారిని సేవిస్తారని అంటారు.

ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహం ను చూడవచ్చట.ఇక్కడే భీముడు తనువు చాలించాడని చెప్తారు.

సతోపంత్ to స్వర్గారోహిణి 8 km:- ఈ మార్గం బహు కష్టం గాను ప్రయాణానికి దుస్సాహసం గాను చెప్తారు.

మార్గం లో చంద్రకుండ్ & సూర్యకుండ్ అనే సరస్సులు ఉంటాయట.

ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే కుక్క తోడూ రాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు. 

నిజానికి స్వర్గారోహిణి అనేది 6 పర్వతాల సమూహం గా తెలుపుతారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది. ఇది ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లా లో కల ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి  చెందినది. దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది. 

 ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం ( 20512 అ ఎత్తు లో , 6252 m ) మబ్బులలో ఉంటుందని అది 3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే  మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి  పైకివెళితే స్వర్గ ముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.

 Climbing history:-Swargarohini 1 has been climbed by a 4-man team from West Bengal. The first civilian to reach the summit on 29 June 2016 at 6:45 am was leader, Thendup Sherpa. The expedition was organised by The Natures Foundation Kanchrapara of West Bengal. Its members were Suman Dey, Debabrata Dutta (team leader), Bikramjeet Nath and Bikramjeet Debnath. It was very technical between Camp 1 and Camp 3. There was no site for Camp 2, but ultimately after long hard work, the team successfully summited Swargarohini 1, the first civilians to do so. Suman Dey Summit member

Swargarohini I has seen many climbing attempts. As of 1994, fifteen attempts had been made. On 25 October 1974, Charles Clarke (England); Dilsher Singh Virk, Peter Fuhrman and Bruce MacKinnon (Canada); and Mohan Singh and Rattan Singh (India) made the first ascent of the west summit of Swargarohini I, ascending from the west side. The first ascent came on 3 May 1990, by a team of instructors from the Nehru Institute of Mountaineering. They climbed from the Ruinsara Valley on the north side, via the eastern col connecting the peak to the rest of the range, and found challenging rock climbing to achieve the col, leading to easier snow slopes above. However, other sources claim that this ascent stopped 5 m (16 ft.) short of the summit due to the presence of an unstable cornice. The south face of the peak was attempted unsuccessfully in 1991. On 7 June 1993, an expedition from Sweden made the first undisputed ascent of the peak via this face. The summit team comprised Birger Andrén, Ingela Nilsson, and Ake Nilsson. They ascended a rock ridge on the eastern side of the south face, leading to the easy east-southeast ridge.

సతోపంత్ తాల్ google route map  https://www.youtube.com/watch?v=WtxonUTCZU8 Trek to Satopant lake and Swargarohini Glacier.   https://www.youtube.com/watch?v=j11fIRxFxo0 స్వర్గారోహిణి ఎక్కిన వారి ప్రయాణ అనుభవాలు చదవాలంటే https://www.himalayanclub.org/hj/47/8/the-first-ascent-of-swargarohini-i/

పాండవులు బొందేతోనే స్వర్గము చేర ప్రయత్నించినారు అన్న భారతములోని విషయమును వాస్తవమని నమ్మి నా చేతనైన మేరకు మీముందుంచుచున్నాను.

నేను, స్వర్గారోహణ మార్గము యొక్క వివరములను  తెలుసుకోవలెననియే కానీ ఆదారిన వెళ్ళవలెనని కాదు. కారణము నాకు వయసు సహకరించదు.  అందుచేత తెలుగు English భాషలలో నాకు తెలిసిన సమాచారం సేకరించినాను. నా ధృడమైన నమ్మకము ఏమిటంటే వ్యాసులవారు, ధర్మాత్ముడగు ధర్మరాజు, ఆయన తమ్ములు, వారి ఇల్లాలిని గూర్చి భారతములో ఈ ప్రస్తాపనాను గూర్చి విస్తారముగా వ్రాయటమే! నాటి మహనీయులు అబద్ధాములను ఆడారు, అభూత కల్పనలు చేయరు అన్నది నా ధృడ నమ్మకము. మనము చూడనంత మనకు తెలియనంత మాత్రాన, వ్యాసుని వంటి పెద్దలు చెప్పిన మాటలు అబద్ధములు కానవసరము లేదు. ఇందుకు సంబంధించిన విశేషములు ఇంకా తెలిసివుంటే ఎవరైనా అభిప్రాయ వేదికపై వ్రాసి పుణ్యము కట్టుకోనవచ్చును.

స్వస్తి...

Sunday, 21 November 2021

కుచేలుడు నిరుపేదయైన కారణము.

 

కుచేలుడు నిరుపేదయైన కారణము.

https://cherukuramamohanrao.blogspot.com/2021/11/blog-post_21.html

ఇది గర్గ్య  భాగవతములో చెప్పిన మాట. బలరామ కృష్ణ సుదాములు సాందీపని గారి శిష్యులు. గురుకులములో వర్ణ విచక్షణ ఉండదు. ఏ వర్ణమునకు తగిన విద్య ఆ వర్ణమునకు నేర్పుతారు. ఒకరితోనొకరు, గురుకులములో సఖ్యతగా ఉంటారు. అసవర్ణులైనా ఎంతో అన్యోన్యముగా ఉంటారు. అటువంటి అన్యోన్యత కలిగిన జంట శ్రీకృష్ణ కుచేలులది.

గురువు వేతనమేమీ లేకుండానే విద్య నేర్పించినా, లబ్ది పొందినవారు ఈ

క్రింది శ్లోకార్థమునకు కట్టుబడి ఉందితీరవలసినదే!  ‘విద్య దానము కాదు’. జిజ్ఞాసువుకు అది ఒక విధముగా అసిధారా వ్రతము. గురువు కను సైగాలలో మెదలుతూ ఆయన కుటుంబ జీవనమునకు తగిన వనరులను అడవి నుండి సమకూర్చుచూ, ఉన్నవారూ, ఉన్నతమైన వారు తమ శక్తిలోపము లేకుండా ధన సహాయము చేయుచూ, గురువు వద్ద విద్య ఎర్వవలసి ఉంటుంది. ఈ క్రింది శాస్త్ర చోదిత శ్లోకమును చూడండి.

గురు శుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేనవాl

అధవా విద్యయా విద్యా చతుర్థం నోపలబ్ధతేll

 విద్యను అభ్యసించే విషయంలో మూడు విధానాలు చెప్పబడినాయి.1.గురువుగారిని సేవించి,సపర్యలు చేసి ,2.ఆయనకు సమ్మతమైన మేరకు పుష్కలమైన ధనమును ఇచ్చి 3.తన దగ్గర ఉన్న విద్యను ఆయనకు నేర్పి ఆయన దగ్గర ఉన్న విద్యను నేర్చుకొనుట మినహా   నాలుగవ విధానము లేదు అని.

అందులో భాగాముగానే ఒకరోజు గురువుగారికి సమిధలు సమకూర్చుటకు శ్రీకృష్ణ కుచేలులు అడవిలోనికి బయలుదేరినారు. అనూహ్యముగా మేఘములు కమ్ముకొని

వాన కురియుట మొదలుపెట్టుటచేత ఆశ్రమము వెళ్ళలేక ఒకచేట్టునేక్కి కూర్చున్నారు. అందునా కుచేలుని పైకొమ్మపై కూర్చుండ తెలిపి తాను క్రింది కొమ్మపై కూర్చున్నారు శ్రీకృష్ణులవారు. కారణము నిజమునకు ఏమిటంటే కుచేలుడు అగ్రవర్ణుడు. అర్ధరాత్రి గడిచింది. ఇటు కుచేలునికీ అటు శ్రీకృష్ణునికి కూడా ఆకలి వెయ మొదలైనది. తానూ తెచ్చుకొన్న కొన్ని అటుకులు మిత్రునితో పంచుకొంటే చాలవని తలచి మూట విప్పి, తాను మాత్రమే తిన దోదగినాడు. దీనిని పైనుండి బ్రహ్మ గమనించుచున్నాడన్నది గ్రహించలేక కుచేలుడు తనపనిలో తానూ నిమగ్నమైపోయినాడు. అటుకులు నమిలే కటకట శబ్దము కుచేలుని నుండియే వచ్చుచున్నదని గ్రహించిన శ్రీకృష్ణుడు ‘ ఏమిటో నములు చున్నావే కుచేలా! ఆకలగుచున్నది, నాకు కూడా కొంచెము పెట్టు’ అన్నాడు. అప్పుడు కుచేలుడు ‘అబ్బే ఏమీలేదు, వర్షము వల్ల వచ్చే  వణుకుతో పపళ్ళు, క్రిందిపళ్ళు తగిలి శబ్దము వస్తూ వున్నది’ అని అన్నాడు. ‘ఓహో! లోకాలనేలే సామికె అబద్ధము చెబుతావా’ అని అప్పటికప్పుడు కుచేలుని నుదుట శ్రీ క్షయః’ అని వ్రాసినాడు. అది మొదలు అతని సంపద క్షీణించి క్షీణించి నిరుపెడగా మిగిలి పోయినాడు.

మరి కృష్ణుని వద్దకు ఉత్తచేతులతో పోకూడదని తెలిసినవాడగుతచే  ఇంట ఉన్న పిడికెడు అటుకులూ, నాటి పాపమునకు పరిష్కారమా!’ అన్నట్లు కట్టుకొని బయలుదేరినాడు. పైగా శాస్త్రము తెలిసినవాడాయె! శాస్త్రము ఏమి చెబుతూ ఉన్నదంటే:

దదాతి ప్రతిఘృణ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి l

భుంక్తేచ భోజయిత్యైవ షడ్విధం మిత్రలక్షణం ll  అన్నది.

అడితెలిసినవాదయినందువల్ల కుచేలుడు అటుకులతో బయలుదేరినాడు.

మిగిలిన కథ మీకు తెలిసినదే!

స్వస్తి.  

Friday, 12 November 2021

లక్ష్మీకటాక్షము (కుచేలోపాఖ్యానము)

 

లక్ష్మీకటాక్షము

https://cherukuramamohanrao.blogspot.com/2021/11/blog-post_12.html

‘కుచేలోపాఖ్యానము’ కథ అందరికీ తెలిసినదే! అందువల్ల ఆవిషయమును నేను ప్రస్తావించుట లేదు. ఒక్క విషయమును మాత్రము ఇక్కడ ప్రస్తావించుచున్నాను. ద్వారపాలకును ద్వారా కుచేలుని వర్ణన, అతని దీనావస్థ విన్న అరమాత్మునికి కంట నీరు జలజల రాలినది. తక్షణమే ఆ మహాభక్తుని, ఆత్మీయ మిత్రుని ప్రవేశపెట్టమన్నాడు. ఆగని కంటినీటితో అట్లే ఆలింగనము చేసుకొన్నాడు తన ప్రాణ మిత్రుని. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయమును గమనించినాడు కాళీదాస మహాకవి.

ఆయన  తన  'ఘటస్తవము' లో ఈ విధముగా చెప్పినాడు;

లక్ష్మీ వశీకరణ చూర్ణ సహోదరాణి

త్వత్ పాదపంకజ రజాంసి చిరం జయంతిl

యాని ప్రణామ మిళితాని నృణాం లలాటే

లుంపంతి దైవ లిఖితాని దురక్షరాణి ll

తల్లీ ఏ భక్తుడయితే నీ పాద పద్మములు మది తలచి, నుదురు నెలకు ఆన్చి నమస్కరించుచున్నాడో ఆతని ఫాలమునకు నీ పాద రజస్సు అంటుటచే నుదుటిపై బ్రహ్మ వ్రాసిన చెడుగు అంతా తుడిపివేయబడి ఐశ్వర్యవంతుని చేయుచున్నది అని తెలిపినాడు.

ఆ విధముగా ఇక్కడ, ఆలింగనము చేసుకొన్న మిత్రుని శిరస్సు పరమాత్ముని హృదయ పరివేష్ఠితయైన లక్ష్మీదేవి పాదములకు తగిలినదట. ఆ చరణ రజము తన శిరస్సును అంటినవెంటనే కుచేలుడు సుదాముడైనాడు. అంటే ఐశ్వర్యవంతుడైనాడు అని, ఆపై మూడు గుప్పిళ్ళ అటుకులూ  ఔపచారికమనీ తెలియజేస్తున్నాడు ఆ కాళీ ప్రసన్నుడగు మహానుభావుడు.

ఇక్కడ మనము తప్పక తెలుసుకొనవలసిన విషయము ఏమిటంటే భక్తుడు ప్రత్యేకముగా ఒకదేవతను ఆరాధించక వేరు దేవతను తలచుచున్ననూ, ఆతని కోర్కె ఈడేర్చుటకు మరియొక దేవత సిద్దమౌను. ఇక్కడ నిర్మల చిత్తము, నిశ్చల తత్వము మిక్కిలి అవసరము.

స్వస్తి.

Wednesday, 10 November 2021

మహా నారాయణోపనిషత్

 మహా నారాయణోపనిషత్


హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ |
స దాధార పృథివీం ద్యాముతేమాం కస్మై దేవాయ హవిషా విధేమ ||

యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ |
య ఈశే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ ||

 య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః |
యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ ||

యస్యేమే హిమవన్తో మహిత్వా యస్య సముద్రఁ రసయా సహాహుః |
యస్యేమాః ప్రదిశో యస్య బాహూ కస్మై దేవాయ హవిషా విధేమ ||

యం క్రందసీ ఆవసా తస్తభానే  అస్త్యైక్షేతాం మ్కనసా రేజమానే l
యత్రాది సూర ఉదితౌ వ్యేతి కస్మై దేవాయ హవిషా విధేమ ll

ఏన ద్యౌ రుద్రా పృథివీ చ దృఢే ఎన సువః స్తభితం ఎవ నాకః l
యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమ ||

ఆపోహ యన్మహతీర్విశ్వమాయం దక్షం దధానా జనయంతీరగ్నిం l
తతో దేవానాం నిర్వర్తతాసురేకః కస్మై దేవాయ హవిషా విధేమ ||

యశ్చిదాపో మహినా పర్యపశ్యద్దక్షం దధానా జనయంతీరగ్నిం l
యొ దేవేష్వధి దేవ ఏక ఆసీత్ కస్మై దేవాయ హవిషా విధేమ ||

Friday, 29 October 2021

అర్జనుని సందేహం

అర్జనుని సందేహం

https://cherukuramamohanrao.blogspot.com/2021/10/blog-post.html

కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ।

ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదన ।। 2-4 ।।

భీష్ముడు కురువృద్ధుడు, గుణవృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు అందునా అర్జనునిపై అమితమైన 

అనురాగము కలిగినవాడు.

ఇక ద్రోణుడో!

శ్లో. ప్రణవో ధనుః శరో హ్యాత్మా

బ్రహ్మ త ల్లక్ష్య ముచ్యతే !

అప్రమత్తేన వేద్ధవ్యం

శరవత్ తన్మయో భవేత్ || (ముండకోపనిషత్తు)

ఓం అనే ప్రణవ నాద మంత్రమే ధనుస్సు. జీవాత్మయే ప్రాణం. బ్రహ్మమే అక్ష్యం. 

నిర్మలహృదయంతో ఏమరుపాటులేకుండా ఆ లక్ష్యాన్ని చేదించి తన్మయత్వం చెందాలి.

లక్ష్యాన్ని చేరాలంటే బాణం అవసరం కదా! ఆ బాణం సంధించడానికి ధనుస్సు అవసరం! 

అటువంటి ధనుస్సే ఓంకారం. ప్రణవార్ధాన్ని తెలుసుకోవడమే జ్ఞానంగా చెప్పబడుతోంది. 

అంటే ఇక్కడ ఏకాగ్రతను గూర్చి యోగమున దాని ప్రాధాన్యతను గూర్చి చెప్పబడినది. 

,గురువు ద్రోణాచార్యునివద్ద నేర్చుకొన్నఈ యోగ సాధనను ధనుర్విద్యకు 

అనుసంధించుటచే అర్జనుడు పక్షి యొక్క కంటిని మాత్రమే చూచి, బాణముచే గుడ్డును 

మాత్రమే తాకునట్లు వేయగలిగినాడు.

అంటే విలువిద్య అనే వ్యాజ్యంతో అనేక విద్యలు నేర్పినవాడు గురువు ద్రోణాచార్యుడు.

అర్జనుడంటూవున్నాడు

యోత్స్యమానాన వేక్షేఽహం ఏతేత్ర సమాగతాః

ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేః యుద్దే ప్రియచికీర్షవః ।। 1-23 ।।

 దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుని సంతోషపెట్టుట కొరకు అతని పక్షాన యుద్ధానికి 

వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.

పాపిష్టి బుద్ధి గలవారైన ధృతరాష్ట్రుని తనయులు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు. 

వారు అధర్మానికి ప్రతీకలు కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా దురుద్దేశంతో 

ఉన్నవారే, దుష్టులే! అట్టి దుష్టులను ఒకసారి చూడదలచినాడు. నిజానికి మొదట్లో 

అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నో సార్లు 

పాండవుల వినాశనానికి కుట్రలు పన్నినాడు అని సూచిస్తూ, పాపిష్టి బుద్ధి వారైన 

ధృతరాష్ట్రుని తనయుల ను గుర్తు చేసాడు. అర్జునిడి దృక్పథం ఇలా వుంది. "మేము 

న్యాయ బద్ధంగా రాజ్యం లో సగ భాగానికి అర్హులము, కానీ అతను దాన్ని లాక్కోవాలని 

చూస్తున్నాడు. వాడు చెడు బుద్ది కలవాడు ఇంకా ఈ రాజులు వాడికి సహాయం 

చేయటానికి ఇక్కడ గుమికూడినారు, కాబట్టి వారు కూడా దుర్మార్గులే. యుద్ధం కోసం 

ఇంత ఆతురత తో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి. వారు అధర్మం వైపు 

మొగ్గుచూపుతున్నారు, కాబట్టి మా చేత నాశనం అయిపోతారు."

పార్థ అన్న మాటకు పృథ అంటే కుంతీ కుమారుడు అన్న అర్థమే కాక విశాల భావములు 

కలిగిన వాడు అనికూడా ఒక అర్థము.

భగవద్గీతలో భగవంతుని ప్రోత్సాహక వాక్యములు

Decision tree, flow chart అన్న ఈ నేటిమాటలను వికల్పము అని సంస్కృతములో 

అంటారు.

శ్రీభగవానువాచ:

శ్లో॥ కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితం |

అనార్యజుష్ట మస్వర్గ్యం అకీర్తకర మర్జున! ||         (2)

శ్లో॥ క్లైబ్యం మాస్మగమః పార్థ! నైతత్త్వ య్యుపపద్యతే |

క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! ||     (3)

 తా ॥ భగవానుడంటున్నాడు, అర్జునా! యుద్ధానికి సిద్ధమైయున్న ఈ 

విషమసమయంలో ఈ కశ్మలం (మాలిన్యం) నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఇది 

ఆర్యులకుఅనగా శ్రేష్ఠులకు  తగినది కాదు. స్వర్గాన్ని, కీర్తిని చెడగొట్టేది, పరంతపా! 

నపుంసకుడివి కావద్దు. ఇది నీకు శోభనివ్వదు. నీచమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని 

విడిచిపెట్టి లేచి నిలబడు.

వ్యాఖ్య :- ధనుర్బాణాలు పారవేసి, రథం వెనుక చతికిలబడి కూర్చున్న అర్జునుని

పోటుమాటలతో, అతడిలోని దుర్బలత్వాన్ని పారద్రోలాలనుకున్న భగవానుడు

తారాజువ్వల వంటి, పిడుగుల వంటి మాటలతో అర్జునునికి చురుకు ముట్టిస్తున్నాడు.

1) అనార్యజుష్టం : ఆర్యులు, అనార్యులు అని 2 జాతులు. ఆర్యులంటే సన్మార్గంలో 

నడిచేవారు, పవిత్రులు, తేజస్సు గలవారు, స్వధర్మాన్ని పాటించేవారు, ధర్మాన్ని 

నిలబెట్టేవారు. ఈ లక్షణాలు లేనివారు అనార్యులు. నీవు క్షత్రియ కులంలో 

జన్మించినవాడవు. ఆర్యపురుషుడవు. నీ పిడికిలిలో బలముంది, గుండెలో ధైర్యముంది

బాణాల్లోపదునుంది, చేతిలో అద్భుత విద్య ఉంది. అయినా పామరుడిలాగా 

ఏడుస్తున్నావు. చేతగాని చవటదద్దమ్మలా చేతులు ముడుచుకొని కూర్చున్నావు. నీకిదేం 

బుద్ధి? ఇది ఆర్యులకు తగినదేనా?

2) అస్వర్గ్యం : యుద్ధంలో జయిస్తే రాజ్యం వస్తుంది. ఒకవేళ మరణిస్తే వీరస్వర్గం 

లభిస్తుంది. యుద్ధం చేస్తే విజయమో - వీరస్వర్గమో ఏదో ఒకటి ఖాయం. కాని ఇలా 

చేతులు ముడుచుకు కూర్చుంటే విజయమూ లేదు, వీరస్వర్గమూ రాదు.

3) అకీర్తికరం : పోనీ రాజ్యసుఖం వద్దు, స్వర్గ సుఖం వద్దు. యుద్ధం మానేస్తే నీకేమైనా 

కీర్తి ప్రతిష్ఠలొస్తాయా? కీర్తి రాకపోగా కావలసినంత అపకీర్తిని నెత్తికెత్తుకుంటావు. 

ఇప్పటివరకు అర్జునుడంటే హడల్. ఈ దెబ్బతో అర్జునుడు ఒట్టి 'కాగితంపులి

అనుకుంటారు. 'పిరికిపంద' అంటారు. ఎగతాళి చేస్తారు.

కనుక అర్జునా! జాగ్రత్తగా ఆలోచించు. యుద్ధం మానేస్తే (1) రాజ్యం రాదు (2) స్వర్గం 

రాదు.

(3) కీర్తి రాదు (4) స్వధర్మం నుండి వెనుదిరిగిన వాడివవుతావు. (5) ధర్మరక్షణ జరగదు (6) 

అందరూ నిన్ను చూచి పరిహాసం చేస్తారు. ఇదంతా నీకు అవసరమా?

క్లైబ్యం మాస్మగమః : అర్జునా! పేడివి కావద్దు. ఖాండవ వన దహన సమయంలో అపూర్వ 

ధైర్యసాహసాలు ప్రదర్శించి దేవేంద్రుని జయించావు. దేవతలకే అసాధ్యులైన నివాతకవచ

కాలకేయులనే రాక్షసులను హతమార్చిన వాడివి. భీష్మద్రోణాది మహావీరులతో కూడిన 

కౌరవసేనను, ఉత్తరగోగ్రహణ సమయంలో నీవొక్కడివే అసహాయుడవై ఎదిరించి 

జయించావు. పరమేశ్వరునే ఎదిరించి పోరాడి, పాశుపతాస్త్రాన్ని సంపాదించావు. 

పరాక్రమం విషయంలోనే కాదు; నీవు స్వర్గలోకం వెళ్ళినప్పుడు, అప్సరస ఊర్వశి 

తనంతతాను వలచివచ్చి, నీ చెంత చేరి, తన కోరికను వెలిబుచ్చింది. అయినా ఆ 

సుందరిని తిరస్కరించి, ఇంద్రియనిగ్రహంలో మహామునులను, ఋషి పుంగవులను 

తలపింపజేశావు. అందుకు ఆగ్రహించిన ఊర్వశి నపుంసకుడవు కమ్మని శాపమిచ్చింది. 

ఆ శాపాన్ని విరాట నగరంలో వరంగా ఉపయోగించుకొని అందమైన అమ్మాయిలకు 

ఆటపాటలు నేర్పుతూ నిన్ను నీవే మరచిపోయావు. ఇప్పుడా శాపప్రభావం పోయినా 

ఇంకా నీకు ఆ లక్షణాలు పోలేదా? ఇప్పటికీ పేడిలాగానే భావించుకుంటున్నావా

నీకన్నా మీ అన్న భీమన్న చాలా నయం కదా! విరాటరాజువద్ద వంటలవాడిగా ఉండి

పప్పుదప్పళాలు వండి వార్చినా, ఇప్పుడు శతృవులపై పళ్ళు పటపట కొరుకుతున్నాడు. 

మరి నీవేమిటో! ఇంకా ఆ నపుంసక లక్షణాలను విడవలేకపోతున్నావు. లే, లేచి నిలబడు. 

హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు - అని పిడుగులు కురిపిస్తున్నాడు భగవానుడు.

పరంతపా! అంటే శతృవులను తపింపజేసేవాడా! అని. ఇలా ఒకవైపు ప్రోత్సాహాన్నిస్తూనే

బాహ్య శత్రువులనే గాదు అంతః శతృవులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద

మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను కూడా తపింపజేయాలి అనే హెచ్చరికను అంతర్లీనంగా 

అందిస్తున్నాడు భగవానుడు సర్వమానవాళికీ.

శిష్యుడు, భక్తుడు స్నేహితుడు, అర్జనుడు శ్రీకృష్ణునికి.

చేతగానితనము వల్ల వచ్చిన దయ దయ కాదు.

బద్ధకము వలన వచ్చిన వైరాగ్యము వైరాగ్యము కాదు.

In his commentary on the text, Gandhi conceded, “I do not wish to suggest that violence has no place at all in the teaching of the Gita.” He acknowledged the ambivalence that “it is difficult to reconcile a few of the verses with the idea that the Gita advocates non-violence” but “still more difficult to reconcile the teaching of the work as a whole with the advocacy of violence.” Gandhi blamed this ambivalence on the author of the Gita.

భగవద్గీతపై తన వ్యాఖ్యానంలో, గాంధీ ఈ విధముగా తెలిపినారు: "గీత బోధనలో హింసకు అస్సలు స్థానం లేదని నేను తెలుపుదలచుకోలేదు." "గీత అహింసను సమర్ధిస్తుంది అనే ఆలోచనతో కొన్ని శ్లోకాలను అన్వయించుట కష్టం" అని అతను సందిగ్ధతను అంగీకరించినాడు, అయితే "మొత్తం గీతా బోధనను హింసను సమర్థించుచున్నది అనుట  ఇంకా కష్టం." గాంధీ ఈ సందిగ్ధతను గీతాకారునిపై వ్యక్తము చేసినాడు. ఇది ఆయన అవగాహనకు నిదర్శనము..

స్వస్తి.

Tuesday, 15 June 2021

రుద్ర న్యాసము - రుద్ర పంచ ముఖ శ్లోకములు

 

రుద్ర న్యాసము - రుద్ర పంచ ముఖ శ్లోకములు

https://cherukuramamohanrao.blogspot.com/2021/06/blog-post.html


శివుడు పంచ ముఖుడు. సింహానికి కూడా పంచ ముఖమన్న పేరు వుంది. అదట్లుంచితే 

బ్రాహ్మలు సంధ్యావందనమునకు పూజకు వాడే అర్ఘ్య పాత్రను పంచపాత్ర అంటారు. 

అర్ఘ్యజలము వదులుటకు రెండుచేతులలో నీరు తీసుకొని వదలవలసి వస్తుంది కాబట్టి 

ఆ పాత్ర యొక్క ముఖము వెడల్పుగా ఉంటుంది. అంతేకానీ అది పంచలోహములతో 

చేయబడినది అని కాదు. పంచపాత్రలు కంచు, రాగి, ఇత్తళి మొదలగు 

లోహ\లోహమిశ్రణముల ద్వారా కూడా చేయించుకొంటారు. పంచలోహములతో 

చేయించే వస్తువుల ఖరీదు చాలా ఎక్కువగా ఉంతుంది. అందుచే అది అందరికీ 

అందుబాటులో ఉండదు. పంచ అంటే వెడల్పయిన అని ఒక అర్థము. గంగ,చంద్రుడు

మూడుకన్నులు, వ్యోమకేశముల జటలు మరి ఇన్ని ఉన్నపుడు ఆయన ముఖము కూడా 

పంచముఖమే. పైపెచ్చు మహాన్యాసము ఆయనకు ఐదు ముఖాలు కూడా ఉన్నవని 

చెబుతూ వుంది. అంటే శివుడు అన్నివిధాలా పంచాస్యుడే!

 తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే 

పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస 

వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే 

శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.

తత్పురుష ముఖ ధ్యానమ్

సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం

గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం

అర్ధేందుద్యుతిలోలపింగలజటా  - భారప్రబద్ధోరగం

వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ,తటివిద్యుత్ 

(మెరుపు)తేజముతోను, కరిగిన బంగారు కాంతితోను పోటీ పడు తేజములను తన 

రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితమై భయంకరమైన అగ్నిశిఖలవలె వలె 

ప్రకాశించు ఎర్రని పెదవులు కలదియు, బాలేందు ద్యుతి (బాల చంద్ర రేఖలు)తో కూడిన  

పింగళ వర్ణపు జటాపటలమును కల్గి  (జడల గుంపు),భుజంగ భూషణములచే 

వలయితమై (చుట్టబడినదై), సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి 

సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (ఇందు రజోగుణ 

ప్రధానమైన సృష్టి తత్వము ఇక్కడ స్తుతియింప బడినది)

అఘోర ముఖ ధ్యానమ్

కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం

కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం

సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం

వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం

తాత్పర్యము: నల్లని మేఘములతోనూ, తుమ్మెదల నల్లదనముతోనూ పోలిన కాంతితో 

ప్రకాశించునదియు, మిక్కిలి వెడల్పయిన గోరోజనపు వర్ణపు కన్నులు కలదియు, చెవుల 

యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న

మొలకల వలె వాడియైన కోరలు  కలదియు, సర్పములతో పాటు హారముగా 

కూర్చబడిన కపాలములు కలదియు, శుక్తి ఖండములతోనూ (ముత్యపు చిప్పల ముక్కలు), ఎగుడు దిగుడగుచు, వంకరలుగా నున్న కనుల యొక్క కనుబొమల ముడులతో 

భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో 

గుణ ప్రధాన లయకర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

సద్యోజాత ముఖ ధ్యానమ్

ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం

భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం

బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః

వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం

తాత్పర్యము:  హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల(మల్లె) పూవు వలె మరియు 

ఆవుపాలపై నురగ వలె తెల్లని కాంతి కలదియు, భసితోద్ధూళిత మైనదియు (విభూతి 

పూయబడినది), మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను 

కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేంద్రాది దేవ సమూహముల చేతను, యోగుల 

చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వదనముతో 

కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. 

(సత్వ గుణ ప్రధాన రక్షణకర్త తత్వమును ఇక్కడ  స్తుతించ బడినది)

వామదేవ ముఖ ధ్యానమ్

గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం

భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం

స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం

వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం

తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూతతో 

నిండినదియు,సొగసైన తిలకము కలదియు, అత్యంత తెల్లదనము కల చెక్కిళ్ళు 

కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుల ప్రకాశముతో పాటు

చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు 

ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని తుమ్మెద రెక్కలవంటి 

ముంగురులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలు ప్రకాశము 

కలిగిన శివుని ఉత్తరముఖమునకు నమస్కరించు చున్నాను. (గుణత్రయ మిశ్రమమగు 

ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)

ఈశాన ముఖ ధ్యానమ్

వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం

తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః

వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం

శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం

తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము అను రెండు రెండు లక్షణములే కాక తద్భిన్నమైన  

లక్షణములు  కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  

సకల తత్వముల కంటెను ఉన్నతమైఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  

తమో గుణ రహితమును, త్రినేత్రసహితమును, సూక్ష్మాతిసూక్ష్మమగు నదియు, శాస్తము 

మరియు ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు 

ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మతత్వమును ఇక్కడ 

స్తుతించబడినది)

స్వస్తి.