మహాదేవ నామావళి
నీ నామావళి మహదేవా - మనసా వచసా మహదేవా
తలువగ నెంచితి మహదేవా – తలపులనిలువుము మహదేవా
శివ శివ శంభో మహదేవా – శంభో శంకర మహదేవా
మహదేవా జయ మహదేవా – జయ జయ జయ జయ మహదేవా
1.
శుద్ధ జ్ఞానీ మహదేవా – శూలపాణీ మహదేవా
సుముఖ
తాత హర మహాదేవా – శూలాయుధ పిత మహదేవా
2.
నంది వాహనా మహదేవా – నటరాజ పరా మహదేవా
నాద మూర్తయే మహదేవా – నాగాప్రియ శివ మహదేవా
3.
అంధక సూదన మహదేవా – ఆది భిక్షుకా మహదేవా
అంబర కేశా
మహదేవా – అనాది నాథా మహదేవా
4.
కాల రూప ధర మహదేవా – కాలాతీతా మహదేవా
కాలకంధరా మహదేవా
– కాల కాల హర మహదేవా
5.
విశ్వంకర హే మహదేవా – విశ్వంభర హే మహదేవా
విశ్వేశ్వర హే
మహదేవా – విశ్వ విధాతా మహదేవా
6.
రజ్జు జటాళీ మహదేవా - రవళిత డమరుక మహదేవా
రాగి విరాగీ
మహదేవా – రయ వాంఛితదా మహదేవా
7.
త్రిపురధ్వంసక మహదేవా – త్రినేత్ర ధారీ మహదేవా
త్రిదళార్చిత
శివ మహదేవా – త్రికాల రూపా మహదేవా
8.
సితాభ ధవళా మహదేవా – శీతనగాలయ మహదేవా
శీఘ్ర వరప్రద
మహదేవా – శితికంఠా పర మహదేవా
9.
గజోదరస్థిత మహదేవా – గజదానవ హర మహదేవా
గజ చర్మాంబర
మహదేవా – గజాననా పిత మహదేవా
10.
బాలేందు ధరా మహదేవా – భస్మాలంకృత మహదేవా
భగనేత్ర భిదే
మహదేవా – భక్త జనాశ్రయ మహదేవా
11.
అనంగ హారీ మహదేవా – అనంత రూపా మహదేవా
అవ్యయాకృతీ
మహదేవా – అపర్ణ నాథా మహదేవా
12.
విష్ణు వందితా మహదేవా – విలయ కారకా మహదేవా
విద్వద్హృది
స్థిత మహదేవా – విశాల ఫాలా మహదేవా
13.
తస్కరాధిపా మహదేవా – తరుణేందుధరా మహదేవా
తాపస మూర్తీ
మహదేవా – తాపత్రయ హర మహదేవా
14.
ప్రమదాధిపతీ మహదేవా – ప్రమోద కారక మహదేవా
ప్రకర్ష రూపా
మహదేవా – ప్రకీర్ణ తేజా మహదేవా
15.
దాక్షాయణిపతి మహదేవా – దక్షాధ్వర హర మహదేవా
దర్పక దమనా
మహదేవా – దానవ భంజన మహదేవా
16.
నాగ కంకణా మహదేవా – నాట్యాధిపతీ మహదేవా
నగజ బిడౌజా
మహదేవా – నందివందితా మహదేవా
17.
రిపు వపు హరణా మహదేవా – రింఖణ రేతస మహదేవా
రిరంస వర్జిత
మహదేవా – రీతి మతీశా మహదేవా
18.
ప్రచండ రూపా మహదేవా – ప్రకృష్ట రూపా మహదేవా
ప్రగల్భ రూపా
మహదేవా – ప్రశాంత రూపా మహదేవా
19.
భూత పతీ హర మహదేవా – భువన మోహనా మహదేవా
బుధజన వంద్యా
మహదేవా – భూరిదయాళూ మహదేవా
20.
వారణాశి విభు మహదేవా – వాదాతీతా మహదేవా
వాక్పతి
వంద్యా మహదేవా – వాసవ నుత శివ మహదేవా
21.
పినాక పాణీ మహదేవా – పియూష దాతా మహాదేవా
పీతాంబర నుత
మహదేవా – పీడిత రక్షక మహదేవా
22.
పంచానన శివ మహదేవా – పంచాక్షరి స్థిత మహదేవా
పంచభూతమయ
మహదేవా – పంచామృత ప్రియ మహదేవా
23.
రావణ సేవిత మహదేవా – రాక్షస వందిత మహదేవా
రక్షాకృతి హర
మహదేవా – రమ్య మానసా మహదేవా
24.
రామేశ్వర భవ మహదేవా – రామ తారకా మహదేవా
రజతాచలపతి
మహదేవా – రాజిత ఫాలా మహదేవా
25.
మందాకిని ప్రియ మహదేవా – మందారార్చిత మహదేవా
మార్దవ హృదయా
మహదేవా – మకార మహితా మహదేవా
26.
సాంబ సదాశివ మహదేవా – సాంద్ర దయాకర మహదేవా
సారస మూర్తీ మహదేవా
- సదాశివా హర మహదేవా
27.
హస్తి ముక్తి కృత మహదేవా – అర్జున హితకర మహదేవా
అద్భుత రూపా
మహదేవా – అక్షయ వపుషా మహాదేవా
28.
అప్రమేయ ధృతి మహదేవా - అతుల్య గుణగణ మహదేవా
అతి భయంకరా
మహదేవా – ఆశ్రిత రక్షక మహదేవా
శివ శివ శంభో
మహదేవా శంభో శంకర మహదేవా
మహదేవా జయ
మహదేవా – జయ జయ జయ జయ మహదేవా
రచయిత పాఠక
జనమునకూ – గాయక శ్రోతా గణమునకూ
కోరిన
కోర్కెలు మహదేవా – కూరిమి దీర్చుము మహదేవా
లోకములన్నీ
మహదేవా – లోపరహితముగ మహదేవా
నెలకొను
లాగున మహదేవా – నీదయ జూపుము మహదేవా
నీపై భక్తిని
మహదేవా – నిరతము నిల్పుము మహదేవా
తప్పుల క్షమించి
మహదేవా – దయతో చూడుము మహదేవా
మహదేవా జయ
మహదేవా – జయ జయ జయ జయ మహదేవా
మహదేవా జయ
మహదేవా – జయ జయ జయ జయ మహదేవా
కఠిన
పదార్థములు
1.సితాభ ధవళ
= కర్పూరము వంటి తెల్లనైన
శితి కంఠా =
నల్లని కంఠము కలిగినవాడు
2.
గజోదరస్థిత = గజాసురుని కడుపులో లింగరూపమున వున్నవాడు
3. భగనేత్ర
భిదే = ప్రళయాగ్ని వంటి కన్ను (3వ కన్ను) కలిగినవాడు
4. ప్రకర్ష
రూపా = అతిశయించిన రూపము కలవాడా
ప్రకీర్ణ తేజా = వెదజల్లబడిన తేజస్సు
గలవాడా
5. నగజ
బిడౌజా = పార్వతీ హృదయేంద్రా
6. రింఖన
రేతస = స్కలించిన రేతస్సు గల్గినవాడు
7. రిరంస వర్జిత = కామ వర్జితుడు
8. ప్రకృష్ట
రూపా = చెప్పలేనంత పెద్ద రూపము గల్గిన వాడు
9. పియూష దాత = అమృతామును
అనుగ్రహించినవాడు
చెరుకు రామ మోహన్ రావు