Saturday, 4 January 2014

మనోరంజని వృత్తము 

మనోరంజని అను వృత్తములో మొదటిసారిగా ఈ పద్యమును వ్రాయుచున్నాను . ఈ వృత్త పద్య లక్షణములను 

ఆంద్ర వాల్మీకీ వాసుదాస బిరుదాంకితుండయిన శ్రీయుతులు వావిలికొలను సుబ్బరావు గారు వ్రాసిన వాల్మీకి 

రామాయణములోని సుందరకాండలో హనుమంతుడు మండోదరి మందిరమును దర్శించు సందర్భమున వ్రాసిన 

ఈ వృత్తపద్యము నుండి గ్రహించినాను. ఇందు 

IIII UII IIII UII UII UII UII U గణములు ప్రతి పాదమునకు వచ్చును . ౧౫ వా అక్షరము 

యతి. ప్రాసనియమము కలదు. పద్యము ఈ దిగువన గమనించండి. మనసుకు మారుతి పై 

వ్రాయవలెననిపించింది. అందువల్ల అటులనే చేసినాను. 

అతులిత  భక్తికి  అగణిత  శక్తికి  ఆద్యుడు పూజ్యుడు మారుతికిన్  

సతతము రాముని హితవరియౌ కపి సాత్విక మూర్తికి  పావనికిన్ 

పతితుల పాపము నతి సులభమ్ముగ బాపెడు     కీశకులాగ్రణికిన్ 

జితరతి  మారుతి  రఘుపతి  సక్తికి  చేతు నమస్కృతి చిత్తముతోన్    (సక్తి=ఇష్టుడు)

No comments:

Post a Comment