Saturday, 11 January 2014

Sent from my iPadశ్రీ రామ మొహనరావు గారికి,
నమస్కారములు.
మీ  ఇ- మెయిలు ఇప్పుడే చదివాను. నా ఉద్దేశ్యము ఏమంటే, కంప్యూటర్లో " తెలుగు లిపి తోవ్రాయటము  అలవాటు చేసుకుంటున్నాను" అని.
ప్రస్తుతవిషయానికి వస్తే,
మీ ప్రొద్దుటూరు గురించినాకు తెలిసింది అత్యల్పము. కాని మీరు తెలియచేసింది  అనల్పము. ప్రొద్దుటూరు అంటే సాహితేయులకు ప్రసిద్ధి అని మాత్రమే నాకు తెలుసు. ఇప్పుడు మీ ద్వారా అనేక విషయాలు తెలిసినవి.
బ్రధ్నపురిలో పినాకిని అనే నది ఉన్నదనీ, పినాకిని అంటే " గంగ" అనే అర్థమున్నదన్న విషయము నాకింతవరకు  ఊహకంద లేదు. గంగా దేవికి పోటీగా  పార్వతి, కన్యకగా అవతారమెత్తి, కన్యకా పరమేశ్వరిగా  ఆర్య వైశ్యులకు  ఆరాధ్య దేవత అయిన విషయము మాలాంటి వారికి  తెలియదు. అక్కడి కన్యకాపరమేశ్వరి ఆలయము ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పనలవి కాదు.  సౌందర్య లహరి లో ఆది శంకరులు ఒక శ్లోకంలో అమ్మవారి నవరసాలను వర్ణిస్తూ ...
" వివే శ్రుంగారార్దా..........
సరొషా గంగాయాం.........."
అని వర్ణిస్తారు. సర్వ మంగళకూ, గంగకూ మధ్య ఉన్న రుసరుసలు మహదేవునికి వినొదమే.
అక్కడి ఆర్య వైశ్యులు, వెద పందితులను, ప్రౌఢకవితా సాహితీ రంగాలలోని ఉద్దండులను ఆదరించి, సత్కరించిన  మహనీయులు. ఎందరో బహుముఖీన  పాండితీ మూర్తులకు ఆ ప్రదేశము  జన్మనిచ్చింది. అగస్తీశ్వరాలయములో పుట్టపర్తివారి" సివ తాండవము"  రచన జరిగిందనెది  మరొక కొత్త విషయము.
ఇంతటి ప్రసిద్ధమైన ప్రొద్దుటూరు మీ  నివాసస్థలము కావటము పూర్వ జన్మ పుణ్య ఫలము.
ఇట్లు
భవదీయుడు,
రామచంద్ర మూర్తి.


Sent from my iPadశ్రీ రామమోహన రావు గారికి,
నమస్కారములు.
అంతకుముందు చదివినా, మళ్ళీ మళ్ళీ చదివించే మీ పద్యాలు మీ మెయిలులో చదివి,వాటిపై నా అభిప్రాయాన్ని  మిమ్మల్నిప్రస్తుతిస్తూ వ్రాయకుండా ఉండటము దుర్మార్గము అనిపించి, ఈ కొన్నిపదాలు----
         పద్యాన్ని అలవోకగా అల్లగల మీ నేర్పు అమోఘం.మీ  పద్యాలలో  వేమన, సుమతి, శతక కర్తల దృక్పథం కనిపిస్తూనె, మీ ముద్రను,మీ ప్రత్యేకతను  చాటుకున్నరు. మీ పద్యాలను అంతకుముందు చదవదం వల్ల నేమో అవి  మీవి అని ఇట్టే  గుర్తుపట్టగల అనుభవం మాత్రం సంతరించుకో కలిగాను.
              ఇప్పటికీ అజ్ణానప్రదర్శన చాలు.
ఇట్లు,
మీమిత్రుడు,
రామచంద్రమూర్తి.
RAMA MOHAN RAO Cheruku <ramamohanraocheruku@gmail.com>
18:39 (32 minutes ago)
Reply
to AVR
విజ్ఞాన ప్రజ్ఞా ధురీణు లైన మీరే 'అజ్ఞాన' అనే విశేషణము మీకు వాడుకొంటే నాకేమి విశేషణము వాడుకోను. మనః పూర్వకముగా మీకు విజ్ఞప్తి చేసుకొంటున్నాను మిమ్ముల తగ్గించి నన్ను పెంచవద్దు. మీకన్న తక్కువేకానీ నేను ఎక్కువ కాదు. మీతో సమానముగా చూచుకొన్నా నా అదృష్టము . 

No comments:

Post a Comment