Friday, 3 January 2014


శరణయా వెంకటేశా 


శరణు శరణయా తిరుమల వెంకటేశ 

కరుణ తోడ కాపాడు చిద్విలాస ప్రభో శ్రీనివాస 

కష్ట నష్టాలలో నిన్ను తలతురు 

సుఖము సంతోష మున్నపుడు మరతురు 

సుఖములో నిను తలచే వారు దుఃఖ్ఖించరు 

అన్న ఈ చిన్న మర్మాన్ని మరచుతారు ||శరణు||

కారు మేఘాలు కమ్ముకొనివున్నా 

కటిక చీకటిలో కాలు కదలకున్నా 

నీవె నా కాంతివి నా మనశ్శాంతివి 

దారి చూపించి దరిజేర్చే దాతవీవె        ||శరణు||

No comments:

Post a Comment