శ్రీ పరమేశ్వర తోటకాష్టక స్తోత్రము
పరమేశ్వర పాదసేవానురక్తి కలిగినటువంటి పరమ భాగవతులకు నేను అందించే చిరుకానుక ఈ పరమేశ్వర తోటకాష్టక స్తోత్రము. తోటకము అన్నది ఛందస్సులో ఒక పద్య విశేషము . ఈ తోటకములో రచింపబడినది వెంకటేశ్వర సుప్రభాతమునందలి 'కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీల తనో' అన్న పద్యముతో మొదలయి 'అజ్ఞానినా మయా దోషా' తో ముగిసే స్తోత్రము. ఇందులో 'సులభం సుఖదం...’వరకు రచన తోటక
వృత్తములోనే సాగుతుంది. ఈ వెంకటేశ్వర స్తోత్రమును ప్రతివాద భయంకర అణ్ణన్ అన్న పరమ భక్తుడు మనవళ మహాముని శిష్యుడు రచించుటకు ఎన్నో శతాబ్దములకు పూర్వమే జగద్గురు ఆదిశంకరులవారిని నుతిస్తూ వారి నలుగురు ప్రథమ శిష్యులలో ఒకరి, ఆనందగిరి అన్న పూర్వ నామము కలిగి, శంకరులచేత ప్రతిష్ఠింపబడిన ఉత్తరామ్నాయ పీఠమునకు మొదటి పీఠాధిపతియైన తోటకాచార్యులవారు. ఆయన శంకరులవారి శిష్యులయిన కొత్తలలో మండమతిగా వుండేవారట. అందుచే అందరూ ఆయనను 'గిరి' అని 'అచల' అని పిలిచేవారట. అంటే వారి దృష్టిలో ఆయన అంత మొద్దు.
ఒకనాడు శంకరులవారు ఆనందగిరియోక్క అచంచల భక్తిని మిగత శిష్యులకు చూపనెంచి, ఆవల ఒడ్డుననున్న తన ఆరవేసిన బట్టలను తెమ్మన్నాడు. శిష్యులు ఆలస్యమును సహించలేక పాఠము చెప్పమని శంకరులవారిని తొందర చేసినారు. శంకరులవారు తమ తపః శక్తితో ఆనందగిరిని సకల వేదశాస్త్ర పండితుని గావించినాడు. బట్టలు తెచ్చి నిలిచిన ఆనందగిరి పారవశ్యముతో తదేకముగా గురువును చూస్తూ, కష్టమగు తోటక వృత్తములో, గురుస్తోత్రమును ఎనిమిది శ్లోకములలో చేసినాడు. అదే తోటకాష్టకముగా ప్రసిద్ధినందినది. ఆయన అప్పటినుండి తోటకాచార్యులుగా పిలువబడినారు.
అటువంటి తోటకములో నావంటి చదువురానివాడు శివుని స్తుతిస్తూ ఒక అష్టకమును సంస్కృతములో వ్రాయబూనుట సాహసమే! అయినా నా ఈ ప్రయత్నమునకు పరమేశ్వరానుగ్రహము లభించుట చేతనే నేను దీనిని సంస్కృతములో వ్రాయగలిగినానని త్రికరణ శుద్ధిగా నమ్ముచున్నాను. నా ఈ చిరుప్రయత్నమును మనసారా అభినందించుతారన్న నమ్మకముతో ఈ పరమేశ్వర స్తోత్రముతో మీ ముందుకు వస్తూవున్నాను. ప్రతిదినమూ ఒక్కొక్క శ్లోకమును మీకు అందజేస్తాను.
ఈ పరమేశ్వర తోటకాష్టక స్తుతిని పూర్తిగా వినగోరువారు YOUTUBE నందు ఈ క్రింది లంకెలో వినవచ్చును.
https://www.youtube.com/watch?v=M2GptjCXhbw..
భూతాధిప కాళ విభూష ధరా
శరణాగత రక్షక సాదు ప్రభో
మమ పాపవిదారక మాన్యవరా
పరమేశ దయాకర పాహి ప్రభో
ll 1 ll
కరుణా వరుణాలయ కామ హరా
భవతారణ కారణ భవ్య పరా
అహిధారణ మారణ అక్షధరా
పరిపాలయ మాం శివ భాగ్యకరా
ll 2 ll
శివ శంభు మహేశ్వర శైల
స్థితా
భవ భూతి ప్రదాయక భద్ర హితా
ఇహ సాగర వారధి ఈప్సితదా
సుకపోల సుధామతి శూన్యరతా
ll 3 ll
గళహాల రసంధర గౌరివరా
శిశుచంద్ర విలాసిత శీర్షధరా
అకళంక అనీశ మహా2హిధరా
శరణాగత వత్సల సారతరా ll
4 ll
సుముఖం సుహృదం శుభ సౌఖ్య
యుతం
హర శంకర శూలి మహా మహితం
కరిదానవ భంజక కాలసతం
విధి విష్ణు సదార్చిత
విశ్వనుతం
ll 5 ll
శితికంఠ మయస్కర శీత కరా
భవబంధ విమోచన భాగ్యకరా
కవిగాయక వందిత కావ్య వరా
వరదాభయ, వారణ వస్త్ర ధరా
ll 6 ll
నీలకంఠా, నిఖిల భక్తజన ముక్తిదాతా,
నిరంతర కరుణారుణ కాంతి
కిరణాయుత కమలనయనా, భవ బంధ విమోచనా, భాగ్యప్రదాతా, సతత కవిగాయక వినుత కావ్యనాయకా, గజచర్మాంబర ధారీ, భక్తవరదాతా, భాగ్య ప్రదాతా రక్షమాం.
పరమేశ పరాత్పర భక్తసుధా
జగదీశ జగద్దిత చారు కథా
పరదేవత, పాలిత భక్త ప్రథా
రమణీ ప్రతి, భంజక రాగ వ్యథా
ll 7 ll
పరమేశా,
పరాత్పరా, భక్తజనసేవిత సుధాహృదయా, జగదీశా,
జగత్ప్రఖ్యాత
రసవత్తర కథాకథనాధినాయకా, పరదేవతా,
ఆర్తజనరక్షణా
నియమానువర్తనా, వనితాజనితాకర్షణాన్విత రాగవ్యథాపహారా, రక్షమాం.
పరమాత్మ పతంజలి పాణి నుతం
ప్రమథాధిప, పావన వాణి సతం
సురగంగ జటావళి ఝూట స్థితం
పరమేశ సదాకురు భక్త హితం
ll
8 ll
శివ తోటకమిదం ప్రోక్తం అష్టకస్తోత్ర
రూపిణం
ఏ పఠంతి
సదా భక్తాః తేషాం శంభుః ప్రసీదతి ll
రామమోహన కృతం స్తోత్రం సాయం
ప్రాతర్ పఠేన్నరః
సర్వార్థ సిద్ధిమాప్నోతి
సర్వ దుఃఖోపశాన్తయే ll
No comments:
Post a Comment