Wednesday, 24 January 2018

పుత్రహీనులు - ఉత్తరక్రియలు

కొడుకులు లేనివాళ్ళు కేవలము కుమార్తెలు ఉన్న వాళ్ళ అంత్యేష్టి సంస్కారాలు ఎవరు చేయవచ్చు ?

ఇది " ధర్మసందేహాలు " గ్రూపులో అడిగిన ఒక ప్రశ్న. 

దీనికి మహాభారతములో భీష్మ పితామహులు చక్కగా సమాధానమిచ్చారు. 

హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ 


సంస్కారాల ద్వార పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, 

సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.

పన్నెండు రకాల పుత్ర సంతానం.


వారిలో విభజన చెప్పేరు భీష్ములు భారతంలో. అనుశాసనిక పర్వంలో ధర్మరాజడిగిన ప్రశ్నకు సమాధానంగా, 


అవధరించండి.భారతం. 

అనుశా.పర్వం. అధ్యా-2.. 241 నుండి 256.

1. ఔరసుడు:- తన భార్యయందు తనవలన కలిగినవాడు.

2..దౌహిత్రిడు లేక పుత్రికాపుత్రుడు:- తన భార్యయందు కలిగిన కుమార్తెకు తగిన వరుని చూసి పెండ్లి చేసి, 


కుమార్తెకు కలిగిన 



కుమారుని తన కుమారునిగా పెంచుకున్నవాడు.

3.క్షేత్రజుడు:- తన స్వభార్యయందు తన నియామకంతో పర పురుషుని వలన కలిగినవాడు. (పాండవులు)

4.అత్రిముడు:- కన్న తల్లి తండ్రులు దానంగా ఇవ్వబడినపుడు పెంచుకున్నవాడు. వీనినే దత్తుడు అంటారు.

5.కృత్రిముడు:- తల్లి తండ్రులను వదలి తిరుగుతున్నవాడిని చేరతీసి పెంచినవాడు, అలా పెంచినవారికి కొడుకు.

6.గూఢజుడు:- భర్త కలిగి ఉన్న భార్య, అన్యపురుష సంపర్కంవలన కలిగినవాడు, ఆ భార్య, భర్తల సంతానంగానే 


భావింపబడింది.

7.అపవిద్ధుడు:- తల్లితండ్రుల చే వదలిపెట్టబడి తనకుతానుగా మరియొకరి వద్ద చేరితే, వారు 


ప్రీతితోపెంచుకున్నవాడు, అలా పెంచుకున్నవారికి కొడుకు.

8.కానీనుడు:- పెళ్ళికాకముందు కన్యకు పుట్టినింట జన్మించినవాడు, ఆ కన్యను ఎవరు పెళ్ళి చేసుకుంటే, ఆ 


కొడుకు ఆ కన్యను వివాహం చేసుకున్నవాని కొడుకుగా పరిగణించినారు.(కర్ణుడు)

9.సహోఢుడు:-కన్య గర్భవతి అని తెలియక వివాహం చేసుకున్న తరవాత కలిగినవాడు, ఇతడు అలా కన్యను 


వివాహం చేసుకున్నవాని పుత్రునిగానే ఆమోదించినారు.

10..పునర్భవుడు:-మగడు విడిచినదానికి,మగడు చనిపోయినాదానికి ఎవరి సంపర్కం వలన కుమారుడు కలిగితే, 


అతడు అలా కన్నవానికి కొడుకవుతాడు.

1. స్వయందత్తుడు:- తల్లితండ్రులు లేకపోయినా, వారిచే విడువబడినా, తనకు తానుగా ఇతరులకు కొడుకుగా 


పరిగణించి మసలుకున్నవాడు.

12.:-క్రీతుడు:- కన్న తలి తండ్రులు వెలకట్టి అమ్మగా కొనుక్కునవారికి అతను పుత్రుడవుతాడు.

వీరందరిలోకి ఔరసుడు యోగ్యుడు, ఆతరవాతి వాడు పుత్రికాపుత్రుడు. తరవాతివారు కూడా అన్ని విధాలా 


ఔరసులుగానే పరిగణింపబడ్డారు. వీరంతా కర్మచేయటానికి అర్హులే.

No comments:

Post a Comment